ఆ పదాన్ని తీసేయండి !!

278
Tejaswi Madivada: I am not cute.. Hot
- Advertisement -

టాలీవుడ్‌లో అచ్చతెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ హట్ ఫోటో షూట్‌లతో హీట్ పెంచేస్తోంది. కేరింత, ఐస్ క్రీమ్, రోజులు మారాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి పలు చిత్రాలలో నటించి.. తాజాగా అవసరాల శ్రీనివాస్ ‘బాబు బాగా బిజీ’ అడల్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నటన పరంగా ఫర్వాలదనిపిస్తున్నప్పటకీ అవకాశాలు మాత్రం ఈ అమ్మడుకి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక లాభం లేదనుకుని గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచేసింది. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

Tejaswi

ఇలా ఎందుకు చేస్తున్నానో ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన తేజస్వీ.. తనను క్యూట్ అనడాన్ని తప్పు పట్టిందట. ఇంకా ఏమన్నదంటే’ నన్ను ప్రతి ఒక్కరూ క్యూట్ అంటూనే ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతీ డైరెక్టర్‌ నన్ను ఇంకా క్యూట్‌ అమ్మాయిగానే చూస్తున్నారు. అందుకే కొత్తగా కనిపించేందుకు హాట్‌గా ఫోటో షూట్‌కు ఒప్పుకున్నాను. మీ మైండ్ల నుండి క్యూట్ అనే పదాన్ని తీసేయండి’ అని తెగేసి చెప్పిందట. కనిపించి కనిపించనట్టుగా తన అందాలను దాచేస్తూ ఉన్న తేజస్వి స్టిల్ చూస్తే .. యూత్‌లో సెగలు పుట్టడం ఖాయం. అమ్మడు ఈ స్థాయిలో అందాలు ఆడబోస్తే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయ్ అన్న ఆలోచన బాగానే ఉందికాని.. మరీ ఇంతిలా అన్నీ వదిలేస్తే ఎలా.. కాస్త దాచుకుంటే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

tejaswi

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నవీన్‌ మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మించిన ‘బాబు బాగా బిజీ’ ఈ శుక్రవారం విడుదలవుతోంది.

- Advertisement -