‘భోళాశంకర్’ సెన్సార్ రివ్యూ ఇదే

82
- Advertisement -

దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ అందించారు. పైగా భోళాశంకర్ కి కట్స్ కూడా ఎక్కువ పడలేదు. మరి ఈ సినిమాకి సెన్సార్ టాక్ ఎలా ఉందో చూద్దాం రండి.

భోళాశంకర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా రెండు పాటలు అయితే సూపర్ గా ఉన్నాయట. మెగాస్టార్ చిరంజీవి మాస్ మూమెంట్స్ ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందట.

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా మధ్య లవ్ సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉన్నాయట.అలాగే, మెగాస్టార్ పాత్ర పై క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అదుర్స్ అట.

Also Read:ఎన్టీఆర్ vs బన్నీ.. పోటీ తప్పదా?

ఇక భోళాశంకర్ కథ విషయానికి వస్తే.. సాధారణ కథ అనే తెలుస్తోంది. కథలో సిస్టర్ సెంటిమెంట్ బాగున్నా.. ఇప్పటికే ఆ టైప్ ఎమోషనల్ కంటెంట్ ను చాలా సార్లు చూశాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఓవరల్ గా సెన్సార్ టీం నుంచి భోళాశంకర్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మెగా అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అన్ని భోళాశంకర్ సినిమాలో ఉన్నాయి. కాబట్టి, నిర్మాతలు, బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు.

కాగా, ఈ మూవీలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా, హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:హ్యాపీ బర్త్ డే…తిరుపతి లడ్డు!

- Advertisement -