స్వరాజ్యం నా జన్మ హక్కు… నేను దాన్ని పొంది తీరుతాను అని నినదించిన యోధుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఈ ఒక్క నినాదంతో కొత్త పుంతలు తొక్కించి దేశావ్యాప్తంగా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిన మహానాయకుడు. ఆయనే లోకమాన్య బాల గంగాధర్ తిలక్. .
1856 జూలై 23న జన్మించిన తిలక్…, ఆగష్టు 1, 1920లో మరనించారు. భారతజాతీయోద్యమ పితగా గుర్తింపు పొందిన తిలక్..మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు.చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణం ఆయనది. అంతేగాదు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే అమ్మాయితో పెళ్ళయింది.
1890లో కాంగ్రెస్ లో చేరారు. కానీ తర్వాతి కాలంలో మితవాద రాజకీయాలపై నమ్మకం పోయి పోరాటాన్ని మార్గంగా ఎన్నుకున్నారు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, అతను మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు.
Also Read:స్వాతంత్య్ర స్పూర్తిని నింపిన నేతాజీ..
పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తిలక్. ప్రతి భారతీయునికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించారు. బాల్యవివాహాలను వ్యతిరేకించి వితంతు వివాహాలను ప్రోత్సహించారు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు జైలు శిక్ష కూడా పడింది. జైలులో ఉన్నప్పుడే “గీతారహస్యం” అనే పుస్తకం రాశారు. 1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్‌ని స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ గ్రామగ్రామానా తిరిగాడు.
Also Read:అహింసే మహాత్ముడి…ఆయుధం