CM KCR:అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం..

27
- Advertisement -

రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా తీసుకొచ్చిన 466 వాహనాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

Also Read:TTD:పౌర్ణమి గరుడ సేవ

కొత్తగా ప్రారంభించిన వాహనాలలో వైద్యారోగ్యశాఖ 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలను కొనుగోలు చేసింది. కాలం చెల్లిన అంబులెన్స్‌లు, అమ్మఒడి, హర్సె వాహనాల స్థానంలో నూతన వాహనాలను చేర్చారు. వీటితో గర్భిణులు, రోగులను వేగంగా దవాఖానలకు చేర్చేందుకు వీలు కలుగనుంది.

Also Read:ఆరోగ్యానికి ఈ ఐదు ఎంతో మేలు..!

- Advertisement -