ఇవాళ పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రానుంది.ఢిల్లీ పరిధిలో చాలా సేవలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లు -2023కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగంలో ఫెడలరిజం సూత్రాన్ని ఉల్లంఘించేలా ఉందన్నారు.
Also Read:అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారుల బదిలీల అధికారాలపై కేంద్రం పెత్తనం ఉండేలా ఈ ఆర్డినెన్స్ ను రూపొందించారు. అధికారుల బదిలీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని సుప్రీం తేల్చినా కేంద్రం మాత్రం ఇందుకు విరుద్దంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
Also Read:మహారాష్ట్రకు సీఎం కేసీఆర్