Harishrao:బీసీ బంధుని సద్వినియోగం చేసుకోండి

46
- Advertisement -

సిద్ధిపేట వయోలా గార్డెన్ లో ఆదివారం బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సహం కోసం లక్ష రూపాయల గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరై చెక్కులు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం. నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం అన్నారు. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Also Read:టీడీపీ కోసమే పురందేశ్వరి ప్రయత్నామా?

కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీ ప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారన్నారు.గత ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ పేరిట బీసీలకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, బ్యాంకులు 40 శాతం పెడుతూ తదితర కొర్రీలతో ఎన్నో లింకులు ఉండేవి, ఆ రుణం కోసం షూరిటీ కావాలని తిరిగి తిరిగి చెప్పులరిగేవనీ, కానీ మన సీఎం కేసీఆర్ ఇవేమీ షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు మీకు అందిస్తున్నారు.

Also Read:మళ్ళీ మొదలెట్టిన బీజేపీ?

- Advertisement -