ఇకపై సినిమా పైరసీ చేస్తే..3 ఏళ్ళ జైలు శిక్ష

121
- Advertisement -

ఇకపై సినిమా పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష విధించనున్నారు. లోక్ సభలో పాస్ అయిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.

సవరించిన సినిమాటోగ్రఫీ బిల్ ప్రకారం ఇకపై సినిమాని పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో రికార్డ్ చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష విధించనున్నారు. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ ఖర్చులో 5 శాతం జరిమానా విధించనున్నారు.

భారత సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని.. పైరసీతో సంవత్సరానికి దాదాపు 20 వేల కోట్లు నష్టపోతున్నాం అని చెప్పారు. అందుకే పైరసీని అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పైరసీతో పాటు సెన్సార్ సర్టిఫికెట్స్ లో మార్పులు తెచ్చారు. ఇప్పటివరకు క్లీన్ U, U/A, A సర్టిఫికెట్ ఉండగా UA 7+, UA 13+, UA 16+ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు.

Also Read:Pawan:’బ్రో’ తొలిరోజు వసూళ్లివే

- Advertisement -