పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తమిళ మూవీ ‘వినోదయ సీతం’కు రీమేక్‌గా తీసుకొచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ సముద్రఖని ముందుగా వేరే టైటిల్స్ అనుకున్నారు. ‘కాల పురుషుడు’, ‘కాలభైరవ’, ‘శివుడు’ టైటిల్స్ పరిశీలించారు. అయితే ఈ టైటిల్స్ కంటెంట్ పై తప్పు అంచనాలకు దారి తీస్తుందని తలచి డైరెక్టర్ చివరికి ‘బ్రో’ టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ సినిమాపై అభిమానులతో పాటు కొందరు ప్రముఖులు కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘పవన్ కల్యాణ్ సినిమా ‘బ్రో’ని ఇప్పుడే చూశా. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మానవ జీవితాలను స్పృశిస్తుంది. పవన్ అభిమానులే కాదు, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది.’ అని రఘు రామకృష్ణరాజు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. BRO సినిమాపై ఒక్క ఎంపీ మాత్రమే కాదు, అటు పవన్ అభిమానులు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read:వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కు చిట్కాలు!
మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం ‘బ్రో’ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహో ఫేం సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘OG’ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఐదో షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుందని సుజిత్ తెలిపాడు. ఈ షూట్లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కాబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
Also Read:నీతోనే నేను…టైటిల్ పోస్టర్