ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఎఫెక్ట్ ఓ మై గాడ్ 2పై పడింది. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుండగా తాజాగా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఆదిపురుష్ సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓ మై గాడ్ 2కి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది సెన్సార్.
ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కి వెళ్లడంతో ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూడా ఈ సినిమాని చూపించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ కమిటీ ఓ మై గాడ్ 2 సినిమాకు ఏకంగా 20 కట్స్ చెప్పింది. సెన్సార్ బోర్డు చెప్పిన ఆ 20 కట్స్ మార్చాలి లేదా తీసేయాలి. అలా అయితేనే సెన్సార్ సర్టిఫికెట్ వస్తుంది అని హెచ్చరించింది చిత్రయూనిట్.
Also Read:మిసైల్ మ్యాన్..అబ్దుల్ కలాం
ఆదిపురుష్ విషయంలో సెన్సార్ బోర్డు పై తీవ్ర విమర్శలు రావడమే కాక పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మతం ఆధారంగా వచ్చిన సినిమాలని మరింత జాగ్రత్తగా చూసి సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read:ట్రెండింగ్‌లో ‘టిల్లు స్క్వేర్’ సాంగ్