రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ వెల్లడించింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…25, 26, 27 తేదీలలో అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు… మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు.
Also Read:BRO:ఆ 20 నిమిషాలే కీలకమా!
ఇక రేపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Also Read:పిక్ టాక్ : పొంగిపొర్లిన పరువాల గుమగుమలు