మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్ అట్టుడికిపోయింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాలని విపక్షాలు నిరసన ప్రదర్శనకు దిగాయి. మణిపూర్ అంశాన్ని చర్చించాలని పట్టుపట్టాయి. స్పీకర్ ఓం బిర్లా పోడియం ముందు విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఇది మహిళల సమస్య అని, ఇది రెండు రాష్ట్రాల మధ్య పోటీ కాదు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటన జరగకూడదని ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు.మణిపూర్‌లో జరిగిన క్రూర ఘటన చాలా డిస్టర్బింగ్‌గా ఉందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోదీ సభలో మాట్లాడేందుకు వెనుకాడుతున్నారన్నారు.
Also Read:గోపిచంద్ – రవితేజ..క్రేజీ అప్‌డేట్!
పార్లమెంట్ బయట ప్రకటన చేయడం కాదు అని, ఉభయసభల్లోనూ ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?