కేంద్రమంత్రి,తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్. కుంభకర్ణ నిద్ర లేచినట్టుగా, హీరో ఎంట్రీ ఇన్ టూ తెలంగాణ అన్నట్టుగా కిషన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు.కేంద్రమంత్రి గా ఉండి మణిపూర్ తగలబడ్డ శవాలు…ఆడవాళ్ళ ని నగ్నంగా తిప్పుతారా.? అని ప్రశ్నించారు.రెండు తెగల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.
రజాకార్ల ఫైల్స్ సినిమా తీసి తెలంగాణ లో ఎదో లాభం పొందాలని చూస్తున్నారు…బుల్డోజర్ ప్రభుత్వం అని భయపెడుతున్నారా .? అని ప్రశ్నించారు.తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు…ఏ ముఖం పెట్టుకుని #2bhk చూడడానికి వెళ్తారు.? అన్నారు. ఒక్క పైసా కేంద్రం ఇవ్వకున్నా ఎలా కట్టారో చూసి రండి…మోడీ సమాఖలీకున్ని అని చెప్పుకుంటావు కాదా.,ఆసియ లో అతిపెద్ద స్లం..దారవి ని ఎదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అలా హైదరాబాద్ లో మనసు ఉంటే ఒక ప్లేస్ ని దత్తత తీసుకో అన్నారు.
Also Read:ఆ పది పార్టీల దారెటు?
వరి ఎక్సపోర్ట్ ఎలా బ్యాన్ చేస్తారు అని ప్రశ్నించిన శ్రావణ్…పోడు భూములు ల పై శ్రీకారం చుట్టి ఈరోజు వరకు గిరిజన లకు 4లక్షలకు పైగా ఎకరాలను పట్టాలుగా మార్చామన్నారు.కర్ణాటక లో బీజేపీ కీ కార్రుకాల్చి వాత పెట్టారు కాదా…బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆడవాళ్ల పై అత్యాచారం జరుగుతుంది ఎందుకు.? అని ప్రశ్నించారు.మహిళా రెజ్లర్స్ పై బహిరంగంగా రేప్ చేస్తే చర్యలు ఎందుకు తీసుకోరన్నారు.
Also Read:బీజేపీతో జేడీఎస్ దోస్తీ.. వద్దనుకున్న తప్పలేదా?