- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఇవాళ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 55,150గా ఉండగా 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 280 తగ్గి రూ. 60,160గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ. 55,300గా ఉండగా 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 60,320గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ. 78 వేలుగా ఉండగా హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1500 తగ్గి రూ. 80,500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1961 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు కూడా 24.60 డాలర్లుగా ఉంది.
Also Read:వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం:సీఎం కేసీఆర్
- Advertisement -