రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. తాజాగా మరోసారి వర్షాలపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సమావేశంలో భారీ వర్షాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అంశంతో పాటు పలు అంశాలతో పాటు ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇక ఇప్పటికే గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు తెలిపారు సీఎం కేసీఆర్.
Also Read:ఆ హీరోలకి బేబీ నచ్చలేదు
రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్ లో, ఎమ్మార్వో కార్యాలయాల్లో, కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్ ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.
Also Read:వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం..సాక్షిగా షర్మిల?