ఏపీలో ఏదైనా చిక్కుముడి ఉందా అంటే అది వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ అనే చెప్పాలి. గత ఎన్నికల ముందు అరిగిన వివేకా హత్య కేసులో నిందితులు ఎవరనేది ఇప్పటికీ కూడా అంచు చిక్కడం లేదు. ఏళ్ళు గడుస్తున్న ఇంతవవరకు అసలు నిందితులు ఎవరనేది తేలలేదు. కాగా ఈ కేసులో ఎయిప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది సిబిఐ. ఇక ప్రస్తుతం ఈ కేసు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. అవినాష్ రెడ్డిని ఎప్పటికే పలు మార్పు విచారించిన సిబిఐ.. అరెస్ట్ మాత్రం హోల్డ్ లో ఉంచుతోంది. గత నెలలో అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. కాగా అవినాష్ రెడ్డి విషయంలో అటు సిబిఐ కూడా ఎందుకు వెనుకడుగు వేస్తోందనేది విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. .
తాజాగా సుప్రీం కోర్టుకు సిబిఐ సమర్పించిన ఫైనల్ చార్జ్ షీట్ లో వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు వెల్లడించినట్లు సమాచారం. వివేకా హత్యకు గల కారణాలు, కుట్ర ఎలా జరిగింది, కుట్రలో భాగంగా ఎవరెవరు ఉన్నారు. హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి.. ఇలా తదితర అంశాలపై సుప్రీం కోర్టుకి తెలంగాణ సిబిఐ ఫైనల్ చార్జ్ షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే సాక్షిగా షర్మిల పేరును చేర్చింది సిబిఐ. గత ఏడాది అక్టోబర్ 7న డిల్లీలో షర్మిల సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వాంగ్మూలం ఆధారంగా షర్మిల ను సాక్షిగా పరిగణించింది సిబిఐ.
Also Read:బాక్సింగ్ రింగ్‌లో మృణాల్..పంచ్ కొడితే!
ప్రస్తుతం ఈ కేసులో అవినాష్ రెడ్డి A8 గా ఉన్నారు. కాగా ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించిన సిబిఐ అవినాష్ రెడ్డి కాల్ హిస్టరీలో ఏపీ సిఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. దీంతో వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారా సందేహాలను ప్రతిపక్ష టీడీపీ గత కొన్నాళ్లుగా లేవనెత్తుతోంది. జగన్ ను సొంత బాబాయ్ అయిన వివేక హత్య కేసు విషయం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదనే ప్రశ్న కూడా టీడీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తోంది. మరి ఈ కేసు ఎప్పటికీ ముగింపుకు చేరుకుంటుందో చూడాలి.
Also Read:ఫుల్ కిక్ లో ప్రభాస్ ఫ్యాన్స్