​రక్షక భటుడిగా స్టార్ హీరో…!

662
Rakshaka Bhatudu Telugu Movie Release Date
- Advertisement -

ఈ మధ్య కాలంలో సినిమా ప్రేక్షకులలోకి సరికొత్త పంధాతో దూసుకొచ్చిన కథ అది, ఏ అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు భారీ అంచనాల నడుమ నిలిచింది. అందుకే విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకులు సైతం భారీ స్తాయిలో స్పందిస్తున్నారు. ఆ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టిజర్, ట్రైలర్ ని అత్యద్బుతంగా ఆధరించి మంచి మంచి కథలతో సినిమాలు నిర్మిస్తే మేము విజయాన్ని అందిస్తాం అని తెలుగు చిత్ర సీమకు మరో సారి తెలియజేసారు. అసలు ఇంతకి ఆ కథ ఏంటో, ఆ కథతో తెరకెక్కిన ఆ సినిమా ఏంటో తెలుసా…?

Rakshaka Bhatudu Telugu Movie Release Date

సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ గురు రాజ్ నిర్మించి, రక్ష, జక్కన్న ఫేం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ రచించి దర్శకత్వం వహించిన సినిమా ‘’రక్షక భటుడు’’. పోలీస్ ని ఆంజనేయ స్వామి అవతారంలో మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే సిని ప్రేక్షకుల నుండి తారా స్థాయి అంచనాలను అందుకుంది రక్షక భటుడు టీం. బహుబలిని కట్టప్ప ఏందుకు చంపాడు అన్న స్థాయి లో, పోలీస్ గెటప్ లో నటించిన ఆ స్టార్ హీరో ఏవరు అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలు పెట్టారు అంటే, ఈ సినిమా గురించి సిని మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ప్రధాన తారాగణంగా అందాల తార రిచాప‌నై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, జ్యోతి త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

Rakshaka Bhatudu Telugu Movie Release Date

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ రక్షక భటుడు మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్తాయి లో ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. దైవానికి దెయ్యానికి మధ్య నడిచే ఒక డిఫెరెంట్ కథగా ఇప్పటికే మనకు కనపడుతుంది, కాగ ఈ సినిమా టీం మాట్లాడుతూ మా సినిమాలో కామెడీ, ఏమోషణ్, యాక్షన్, సెంటిమెంట్, లవ్ ని సమపాళల్లో మేళవించి తెరకెక్కించిన పూర్తీ స్థాయి మాస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకొచ్చారు. ఆంజనేయ స్వామి పోరాట యోధుడిగా ఎందుకు మారాడు?, అసలు ఆ ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న స్టార్ హీరో ఏవరు.? ఇంత కొత్తగా తెరకెక్కిన అసలు ఈ సినిమా వెనక దాగిన మెయిన్ కథ ఏంటి అని ప్రేక్షకులలో రేకెత్తిన ప్రతి ప్రశ్న కి మే 12 న విజువల్ గా సమాధానం దొరకనుంది.మరి ఈ మే 12 న మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -