తెలంగాణభవన్‌ కు కేసీఆర్‌..

203
Telangana CM KCR visite telanagana bhavan
- Advertisement -

తెలంగాణభవన్‌ కార్యాలయాన్ని మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణభవన్‌ ఆధునీకరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆదునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌ ఆదునీకరణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. భవన్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన ఆయన.. ఒక్కో గదిలో తిరుగుతూ పరిశీలించారు.

భవన్‌లో ముందు భాగంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌, చెట్లను సందర్శించారు. అంతేకాకుండా అభివృద్ధి పనులకు అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. ఆధునీకరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసారు. అదే విధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో నిర్మిస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం పనులను సైతం పరిశీలించారు‌. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మేయర్ బొంతు రాంమోహన్ తోపాటు పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.

- Advertisement -