పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. ఐతే, బ్రో చిత్ర ప్రమోషన్స్‌లో తాజాగా సముద్రఖని మాట్లాడుతూ త్రివిక్రమ్ పై క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘త్రివిక్రమ్ కి ఈ సినిమా కథని చెప్పగానే.. కేవలం 10 నిమిషాల్లోనే మొత్తం స్క్రీన్ ప్లే ని, స్క్రిప్ట్ ను మార్చేశారని, త్రివిక్రమ్ గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి అని సముద్రఖని చెప్పుకొచ్చాడు. అయితే, నెటిజన్లు మాత్రం సముద్రఖని పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 10 నిమిషాల్లో ‘బ్రో’ స్క్రీన్‌ప్లే ను మార్చేశారు అంటే.. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమా స్క్రిప్ట్ ను, పైగా సాయి తేజ్ లాంటి హీరో కూడా యాడ్ అయిన సినిమా స్క్రీన్ ప్లేని 10 నిమిషాల్లో మార్చేయడం ఏమిటో ?, మరి సముద్రఖని మాటల్లో ఏ మాత్రం నిజం ఉన్నా.. ఈ సినిమా అవుట్ ఫుట్ బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టడం ఖాయం. ఇప్పటికే బ్రో సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. కాగా, బ్రో సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది. ఈ రన్ టైమ్ సినిమాకు చాలా ఉపయోగ పడునుందని.. నిడివి తక్కువ ఉండటం కారణంగా ప్రేక్షకులు ఎక్కువసేపు బోర్ ఫీల్ అవ్వరు అని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.
Also Read:బాధ్యతలు స్వీకరించిన వేద రజనీ..
ఈ లెక్కన వారి కామెంట్స్ ను బట్టి ఈ సినిమా బాగాలేదు అంటున్నారు. బ్రో సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి. బ్రో సినిమా వినోదాయ సిత్తంకు రీమేక్‌గా రాబోతుంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం జులై 28వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Samantha:సినిమాలకు గ్యాప్ ఇచ్చి ధ్యానంలోకి