- Advertisement -
మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని డిమాండ్ చేశాయి. తాజాగా ఈ ఘటనపై స్పందించారు సోనియా గాంధీ.
మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాల గురించి సభలో చర్చించాలని ప్రధాని మోడీని కోరారు సోనియా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్‌సభలో ఈ ఘటన జరిగిందన్నారు.
తొలి రోజు సభ సందర్భంగా ప్రధాని మోదీ విపక్ష నేతల్ని కలిశారు. గ్రీటింగ్ చేస్తున్న సమయంలో సోనియా గాంధీతోనూ మోదీ మాట్లాడారు.ఈ సందర్భంగా సోనియాతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో మణిపూర్ గురించి సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరినట్లు అధిర్ రంజన్ తెలిపారు.
Also Read:భారీ వర్షాలు..మంత్రి హరీష్ సమీక్ష
- Advertisement -