బాహుబలి 2 సినిమా విడుదలై మూడు రోజులైనా కాలేదు అప్పుడే రాజమౌళి నెక్స్ట్ సినిమాపై వినిపిస్తున్న గుసగుసలు మామూలుగా లేవు. బాహుబలి 2 తర్వాత రాజమౌళి కలల ప్రాజెక్ట్ మహాబారతం ఉంటుందని అందరు అనుకున్నారు.
అయితే ఇప్పట్లో మహాభారతం లేదని స్వయంగా రాజమౌళి చెప్పేశాడు. దీంతో బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది చాలా రోజులుగా సినీ అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.
అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజమౌళి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్ లో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని, చాలా కాలం క్రితమే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్నాడన్న ప్రచారం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగానే జరుగుతోంది.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. మరి నిజంగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉందా.? లేదా.?అనేది కన్ఫార్మ్గా తెలీదు. ఏదేమైనా..చిత్రపరిశ్రమలో తన రేంజ్‌ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్న బన్నీకి జక్కన్న సినిమాలో ఆఫర్ తగిలితే మాత్రం బన్ని రేంజ్ మామూలుగా ఉండదు.