రాష్ట్రంలో మరో నాలుగు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో పలు చోట్ల నిన్న రాత్రి నుండి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ …21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.
జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగాం, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:చిరు- చరణ్..మల్టీ స్టారర్ ఫిక్స్?
బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Also Read:కేసిఆర్ అలా చేస్తే సంచలనమే..?