తేనెతో ఖర్జూర కలిపి తింటే..!

52
- Advertisement -

తేనె ఎన్నో రోగాలకు ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. తేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల తేనెను వివిధ వ్యాధుల కొరకు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కఫం, జలుబు, దగ్గు వంటి రోగాలను తగ్గించడంలో తేనె ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ రకమైన వ్యాధులు దూరం కావాలంటే తేనె ప్రతిరోజూ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. .

కాగా తేనెలో ఎండుఖర్జూర కలిపి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయట. ఎండు ఖర్జూరలో మెగ్నీషియం, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తేనె మరియు ఎండు ఖర్జూరలను కలిపి తింటే ఎన్నో రోగాలు దూరం కావడంతో పాటు శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న పాత్రలో తేనె తీసుకొని అందులో విత్తనాలు తీసిన ఎండు ఖర్జూరలను వేసి మూత పెట్టి వారం రోజుల దాకా అలాగే నాననివ్వాలి. తరువాత తేనెలో బాగా నానిన ఖర్జూరలను రోజుకు ఒకటి లేదా రెండు తినాలి. ఇలా చేయడం వల్ల సీజనల్ గా వచ్చే వ్యాధులు అనగా వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు, వంటి సమస్యలు చాలా త్వరగా తగ్గిపోతాయట.

Also Read:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..పక్కా హిట్ !

అంతే కాకుండా కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు ఇలా తేనెలో నానిన ఖర్జూరలు తినడం వల్ల ఎముకలకు కాల్షియం పుష్కలంగా అంది కీళ్ల సమస్యలు దురమౌతాయి. అంతే ఎముకలు కూడా పటిష్టంగా తయారవుతాయి. ఇంకా మగవాళ్ళలో ఎక్కువ మందిని వేధించే అంగస్తంభన, శిగ్రస్కలనం వంటి సమస్యలు కూడా దూరమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుయితున్నారు. చిన్నపిల్లలు ఈ రకంగా తినడం వల్ల వారిలో చురుకుదనం పెరుగుతుందట. కాబట్టి తేనె మరియు ఖర్జూరలు విడివిడిగా తినడం కన్నా ఈ రెండిటిని మిశ్రమంగా తినడం ఉత్తమం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -