కే‌సి‌ఆర్‌ అలా చేస్తే సంచలనమే..?

79
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా విస్తరించాలనే సదుద్దేశంతో ఆయన బి‌ఆర్‌ఎస్ ను జాతీయంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోవలోనే ప్రస్తుతం మహారాష్ట్రలో పార్టీ బలోపేతం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారాయన. కాగా మహారాష్ట్రలో ఎవరు ఊహించని విధంగా బి‌ఆర్‌ఎస్ కు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. అంతే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. .

అసలే రాజకీయ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న మహారాష్ట్రకు బి‌ఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ ఆశ జ్యోతిలా మారింది. దీంతో అక్కడ పార్టీలో లభిస్తున్న ఆధారణ కారణంగా ముఖమంత్రి కే‌సి‌ఆర్ కూడా మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అక్కడ వరుస పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తు అక్కడి ప్రజలకు చాలానే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ మరో అడుగు ముందుకెసే విధంగా కే‌సి‌ఆర్ సిద్దమౌతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మహారాష్టలోని ఏదో ఒక స్థానం నుంచి కే‌సి‌ఆర్ పోటీ చేసేందుకు సిద్దమతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:వైసీపీలో వర్గ ” పోరు “..?

ఇదే అంశం పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు కారణమౌతోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ అధినేతగానే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కే‌సి‌ఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే జాతీయ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ముద్ర మరింత బలంగా పడే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్రలో కే‌సి‌ఆర్ పోటీ చేసే అంశంపై బి‌ఆర్‌ఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి పోలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ టాపిక్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే జాతీయ రాజకీయాల్లో మరో సంచలనానికి తెర లేచినట్లే అని చెప్పవచ్చు.

Also Read:యూపీఏ మార్పు.. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?

- Advertisement -