ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!

34
- Advertisement -

జూలై మూడో వారంలో కూడా థియేటర్‌ ల్లో కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అలాగే, మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న కంటెంట్ పై ఓ లుక్ వేద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

‘హిడింబ’ :

అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 20న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ :

చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. జులై 21న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘హత్య’ :

విజయ్‌ ఆంటోని ‘హత్య’ అనే చిత్రంతో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘అలా ఇలా ఎలా’ :

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. ఈ సినిమా జులై 21న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

Also Read:Amla:ఉసిరితో ఉపయోగాలు

ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్) జులై 19వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3) జులై 20వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) జులై 21వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

బవాల్‌ (హిందీ) జులై 21వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

ఎస్టేట్‌ (తమిళ) జులై 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్పైడర్‌మాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) జులై 18వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా లో ప్రసారాలు ఇవే :

ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) జులై 21వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:వింబుల్డెన్ విజేతగా అల్కరాజ్..

- Advertisement -