తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి:హరీశ్

57
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు అన్నారు మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో మాట్లాడిన హరీశ్..ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు.రాష్ట్రంలో చిన్న,సన్నకారు రైతులు 90 శాతం మంది ఉన్నారు రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బోరు బావుల వద్ద మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ అన్నారు…సోనియాగాంధీ ఉచిత కరెంటు కు వ్యతిరేకం అని కల్వ సుజాత అన్నారు.దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంతెలంగాణ అని…కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగు,ఐదు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదన్నారు.రైతులకు ఏడు గంటల కరెంటు ఇవ్వలేమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని మండిపడ్డారు.

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం పెద్ద జోక్ అని…తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంటు నుండి అన్నారు.నాడు పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిప్యూటి స్పీకర్ గా ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారని గుర్తుచేశారు.నాడు తెలంగాణరైతులకు అన్యాయం జరుగుతుందని మొదట స్పందించింది కేసీఆర్ అని…గడ్డిపోచల్లాగా పదవులు వదులుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎల్లా ఇచ్చారో…తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరంటు ఎలా ఇచ్చామో ప్రజల నుండి రెఫరెండం కోరదామన్నారు.కాంగ్రెస్ విధానం మూడు గంటలు…కేసీఆర్ నినాదం మూడు పంటలు…బీజేపీ నినాదం మతం పేరిట మంటలు అని ఆరోపించారు.ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి…దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు అన్నారు.

Also Read:తమిళ్ తంత్రం.. బీజేపీ ఏం చేయబోతుంది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు 24 గంటల కరెంటు కావాలని డిమాండ్ చేస్తున్నారు…కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు క్రాప్ హాలిడేలు,పరిశ్రమలకు పవర్ కట్ చేయలేదా అన్నారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి నవ్వుకుంటున్నారని…నాడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ వద్దు అంటే ప్రజలు ఇంటికి పంపించారన్నారు.విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేసీఆర్ 37 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు.దాసోజు శ్రవణ్ పై బెదిరింపులను ఖండిస్తున్నాం అన్నారు.

- Advertisement -