చాక్లెట్స్ తినడం మంచిదేనా..?

37
- Advertisement -

చిన్న పిలల్ల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలలో చాక్లెట్స్ ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక యుక్త వయసులోని మహిళలు కూడా చాక్లెట్స్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాక్లెట్ ను ఎక్కువగా తింటే వచ్చే ప్రమాదాల గురించి చాలమందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా దంతక్షయం, చిగుళ్ళ వాపు, పళ్ళు పుచ్చిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే చిన్నపిల్లలను చాక్లెట్స్ ఎక్కువగా తిననివ్వరు తల్లిదండ్రులు. కాగా చాక్లెస్ట్ తినడం వల్ల ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో లాభాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయట. .

ముఖ్యంగా మహిళలు డార్క్ చాక్లెట్ తినడం ఎంతో అవసరమని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. డార్క్ చాక్లెట్స్ ను కోకో బీన్స్ తో తయారు చేస్తారు కాబట్టి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో వచ్చి వివిధ రకాల రుగ్మతలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ ముఖ్య పాత్ర పోషిస్తుందట; అందుకే మహిళలు పీరియడ్స్ టైమ్ లో తప్పకుండా డార్క్ చాక్లెట్ తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అంతే కాకుండా గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వంటివి కూడా దురమౌతాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి. వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు అయిన డార్క్ చాక్లెట్ తింటే మెదడు పనితీరు మెరుగుపడి మతిమరుపు సమస్య దురమౌతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణిలలో పిండం ఆరోగ్యంగా ఉండడానికి కూడా డార్క్ చాక్లెట్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు డార్క్ చాక్లెట్ తినడం మంచిదే గాని అతిగా తింటే పళ్ల సమస్యలు తప్పవని న్యూట్రీషియన్స్ హెచ్చరిస్తున్నారు.

Also Read:పవన్ కు జగన్ శత్రువు కదా..?

 

- Advertisement -