ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముక్కోణపు ప్రేమకథను ‘బేబీ’ రూపంలో ఈతరం యువతకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సాయి రాజేశ్ సినిమాని చాలా బాగా తీశాడు అంటూ క్రిటిక్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత యువతరం ప్రేమ వ్యవహారాలను ప్రేక్షకులకు వివరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని.. కొందరు మూవీ క్రిటిక్స్ అయితే ఏకంగా సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు. అయితే, ఈ రేటింగ్స్ చూసి నెటిజన్లలో కొన్ని అనుమానాలు మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే బేబీ రేటింగ్స్ ను కొనేసింది అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఈ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ కి మీడియా జనంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. పైగా ప్రతి క్రిటిక్ కి మంచి కవర్లు కూడా ఇచ్చారని టాక్. మొత్తానికి బేబీ టీమ్ రేటింగ్స్ కొనేసి.. క్లీన్ హిట్ గా చలామణి అయ్యింది అని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. బేబీ సినిమా అయితే 3.25 రేంజ్ సినిమా కాదు. సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టేస్తోంది. నాలుగైదు సీన్లు మాత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. వారి చేత విజిల్స్ వేయిస్తాయి.
Also Read:GIC ఆధ్వర్యంలో వృక్షాలను రీలోకేట్ చేస్తాం:ఎంపీ సంతోష్
అలాగే, హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, రెండో హీరో విరాజ్ అశ్విన్ పోటీపడి నటించారు. ఒక ఇంజనీరింగ్ అమ్మాయి, ఆటో డ్రైవర్ (ఆనంద్) మధ్య నడిచే ఈ ప్రేమ కథ ఓవరాల్ గా బిలౌవ్ ఏవరేజ్ గా నిలుస్తోంది. కానీ, క్లైమాక్స్ నిరాశపర్చింది. అదే విధంగా సెకండాఫ్ లో నెమ్మదిగా సాగే కథనం సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఏ పాత్రకు అర్థవంతమైన ముగింపు ఇవ్వలేదు.
Also Read:Gadkari:భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రార్థించా