ఓ మూవీ ఆడిషన్స్‌కు వెళ్తే దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ కామెంట్స్ చేసింది. ‘మీరు చాలా లావుగా ఉన్నారు. ఇలా ఉంటే అవకాశాలు రావు.. సన్నగా అవ్వండి. ఫిగర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, మాకూ అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటూ ఓ డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా తనను చాలా నీచంగా కామెంట్స్ చేశాడని, అలాగే మరో దర్శకుడు తనను ఎన్నో విధాలుగా హేళన చేశాడని కావ్య కళ్యాణ్‌రామ్ ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఐతే, ఈ వార్తల పై కావ్య కళ్యాణ్ రామ్ స్పందించింది. బాడీ షేమింగ్ విషయంలో కొంతమంది డైరెక్టర్స్ ధోరణి పై తాను ఏవో కామెంట్స్ చేసినట్టుగా వస్తున్న వార్తల పై ఆమె సీరియస్ అయింది. అసలు ఇలాంటి కామెంట్స్ నేనెప్పుడూ చేయలేదు అని కావ్య చెప్పుకొచ్చింది. పైగా తన విషయంలో ఏ డైరెక్టర్ ఎప్పుడూ అలా మాట్లాడలేదని, అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
Also Read:మాంగోస్టిన్ పండుతో ఎన్ని ప్రయోజనాలో..!
సరే అదంతా పుకారే అయితే ఓకే. కానీ, హీరోయిన్ గా కావ్య కల్యాణ్ రామ్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు అని ఓ జర్నలిస్ట్ మిత్రుడు ప్రశ్నించినప్పుడు, ఆమె ఎందుకు నర్భగర్భంగా ఓ చిరునవ్వు నవ్వింది. కొన్ని భావాలు పైకి చెప్పక్కర్లేదు. అయినా గతంలోనే తాను లావుగా ఉన్నానని కొందరు హేళన చేశారని ఇదే కావ్య కామెంట్స్ చేయడం నిజమే కదా. ఇప్పుడు ఉన్నట్టు ఉండి నేను అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నా… మీరూ మర్చిపోండి అంటే… ఎలా కుదురుతుంది కావ్య ?.
Also Read:రాజకీయాలు అనగానే హీరో పై ఫైన్