అనుష్కకి పెళ్లి ప్రపోజల్.. ప్రభాస్ మాటేమిటి?

61
- Advertisement -

క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తన కొడుకుని పెళ్లి చేసుకోమని అనుష్కకు ప్రపోజల్ పెట్టాడట. కానీ, ఆయన ప్రపోజల్‌ ను అనుష్క తిరస్కరించిందని… నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంటూ అనుష్క చెప్పినట్లు టాక్. నిజానికి, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ తో అనుష్క రిలేషన్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ, వాటిల్లో ఏ మాత్రం నిజం లేదు. అనుష్క.. హీరో ప్రభాస్ తో ప్రేమలో ఉందని, వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. కాకపోతే వీరి ప్రేమ విషయంలో ప్రభాస్ తల్లి బాగా అసంతృప్తిగా ఉన్నారని.. అనుష్కతో ప్రభాస్ పెళ్ళికి కూడా ఆమె అభ్యంతరం చెబుతూ వస్తున్నారని.. అందుకే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోకుండా ఉండి పోయారని.. అనుష్క కూడా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ – అనుష్క ప్రేమ గురించి తెలియక రాఘవేంద్రరావు తొందర పడినట్టు ఉన్నారు.

మరి రాఘవేంద్రరావు ప్రపోజల్ సంగతి ప్రభాస్ కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు అనుష్క కూడా చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి లేడి లక్ వీడియో సాంగ్ ను నిన్న చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 24 గంటల్లో 4.6M వ్యూస్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:#ShivannaSCFC01 అనౌన్స్ మెంట్

- Advertisement -