బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం, పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమే అని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Also Read:పూరి – ఛార్మి బంధానికి ఇదే కీలకం
తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Also Read:కెనడా ఓపెన్ విజేతగా లక్ష్యసేన్..