ప్రపంచ సదస్సుకు ఓయూ ప్రొ.కుమార్ మొలుగారం

55
- Advertisement -

జూలై 17 నుంచి 21వ తేదీ వరకు కెనడాలోని మాంట్రియాల్ లో “ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు” 16వ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో ఈ సదస్సు జరగనుండగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది.

అది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్, పట్టణ, పర్యావరణ ప్రాంతీయ అధ్యయన కేంద్రం RCUES.. డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం కు ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి అని తెలుసా..!

అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ప్రయాణ ఆలస్యాన్ని తగ్గించటం అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. దాదాపు 175 దేశాల నుంచి పరిశోధకులు, ప్రొఫెసర్లు, పారిశ్రామిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఈ సదస్సులో రవాణా సంబంధిత అంశాలపై ఐదు రోజుల పాటు విభిన్న విషయాలపై ప్రపంచ స్థాయి నిపుణులు చర్చిస్తారు.

ఓయూ ప్రొఫెసర్‌కు ఈ సదస్సుకు సంబంధించి ఆహ్వానం అందగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పదహారు దేశాల్లో పర్యటించిన ప్రొఫెసర్ కుమార్ 30కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.

Also Read:KTR:బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి

- Advertisement -