సమంత ప్రేమాయణంపై మరో పుకారు

65
- Advertisement -

సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. ప్రస్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సామ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ సమయాన్ని ఆరోగ్యం, అదనపు చికిత్స కోసం కేటాయించనున్నారు. వచ్చే ఏడాది తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత మళ్లీ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.

సమంత ఇన్స్టా లో ప్రేమకు సంబంధించిన చిత్రాలతో ఆసక్తికర పోస్టు చేసింది. ‘మరణం నుంచి మనల్ని ఏదీ కాపాడలేదు. కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని చిలీ రచయిత పాబ్లో నెరుడా కోట్ ను షేర్ చేసింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారనే ప్రచారం మొదలైంది. దీనిపై సమంత ఎలాంటి స్పందన లేదు. అయితే, ఆమె టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమంతతో ఓ వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ వ్యక్తితో సమంత ప్రేమాయణం నడుపుతుంది అని టాక్.

Also Read:సోంపు వాటర్‌…ఉపయోగాలు

కేవలం ఆ వ్యక్తితో టైమ్ స్పెండ్ చేయడానికే సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుంది అని కూడా తెలుస్తోంది. దీంతో, సోషల్ మీడియాలో సమంత పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనపై విమర్శలు చేస్తున్న వారికి సమంత నుంచి ఎలాంటి కౌంటర్ లేదు. కానీ, సమంత ఫ్యాన్స్ మాత్రం విమర్శల పై రియాక్ట్ అవుతున్నారు. ఓ తోడు కోసం సమంత మళ్లీ ప్రేమలో పడితే తప్పు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. ‘ప్రస్తుత జనరేషన్‌లో కూడా ఇలాంటి విషయాల పై విమర్శలు చేయడం బాధాకరం అంటూ సమంత ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read:‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి..

- Advertisement -