నేటి కంప్యూటర్ యుగంలో గంటల తరబడి కూర్చొని పని చేసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగలంటూ ఇలా చేసే ప్రతి ఉద్యోగం కూర్చొని చేసేదే కావడంతో శారీరక శ్రమ చాలావరకు తగ్గిపోయింది. అయితే ఇలా టైమ్ లిమిట్ లేకుండా ఒళ్ళు కదలకుండా గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల ఆరోగ్య పరంగా పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల లేని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమేనట. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ శాతం పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది.
Also Read:ఆ రెండు పార్టీలలో గుబులు..?
కాబట్టి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూర్చొని పని చేసే వారు త్వరగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందట. శరీరంలోని చాలా భాగాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. తద్వారా శరీరక పాటుత్వాన్ని కోల్పోతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా సిరాల వాపు కూడా ఏర్పడుతుందట. ఇంకా రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల వీపుపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వెన్నునొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇవే కాకుండా. ఊబకాయం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట. అందుకే కూర్చొని పని చేసే వారు ప్రతి అరగంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరగడం మరియు ఒక ఐదు నుంచి పది నిముషాల వరకు శారీరక శ్రమ కలిగిన పనులను చేయడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read:దెబ్బకి అలెర్ట్ అయిన కాంగ్రెస్..?