‘దేవ‌ర’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

71
- Advertisement -

కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా దేవ‌ర‌. ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ వార్త వినిపిస్తోంది. దేవ‌ర ఇంట‌ర్వెల్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ ఓ కొత్త లుక్‌ లో క‌నిపించి ట్విస్ట్ ఇవ్వ‌నున్నాడ‌ని, ఈ ట్విస్ట్ చాలా థ్రిల్లింగ్‌ గా ఉంటుంద‌ని, అస‌లు ఈ విధ‌మైన ట్విస్ట్‌ ను ఎవ‌రూ ఊహించ‌లేర‌ని తెలుస్తోంది. దీంతో పాటూ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్ కూడా ఓ రేంజ్‌ లో ఉండ‌బోతున్న‌ట్లు టాక్ నడుస్తోంది. అన్నట్టు దేవర సినిమాకు సంబంధించి రేపటి నుంచి కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీన్స్, సల్మాన్ మాస్టర్ పర్యవేక్షణలో మరికొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇటీవలే హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలోనూ పలు ఫైట్ సీన్లు చిత్రీకరించారు. ఆ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. సముద్రం నేపథ్యంలో వచ్చే ఆ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయట. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసే యాక్షన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట.

Also Read:విజయ్ ‘లియో’లో ఆర్ఆర్ఆర్ స్టార్!

ఇక దేవ‌ర సినిమాకు సంబంధించి మరో ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది. దేవ‌ర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడ‌ని, ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే ఎన్టీఆర్ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా తీసుకుంటున్న‌ట్లు అంటున్నారు. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. కాగా జాన్వీ క‌పూర్ దేవ‌ర సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతుంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

Also Read:కాంగ్రెస్‌ను నమ్మితే కల్లోలమే..?

- Advertisement -