- Advertisement -
తెలంగాణలో ప్రజా వైద్యం అద్భుతంగా పురోగమిస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోనే తొలిసారిగా నిమ్స్ లో ఏర్పాటుచేసిన రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను ప్రారంబించారు హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..కొంత మంది మంచిని చూడలేరు, మంచిని వినలేరన్నారు.
అవగాహన రాహిత్యంతో తప్పుడు విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తులు కూడా పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Also Read:షర్మిలకు కండిషన్స్ అప్లై.. వాట్ నెక్స్ట్?
బాగా పనిచేసేవాళ్లు ఒక మంచి మాటతో ప్రోత్సాహం కోరుకుంటారు…కానీ కొందరు ఎంత మంచి చేసినా అబంఢాలు వేయడమమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎవరెన్ని మాట్లాడినా టీంగా పని చేద్దాం , ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిద్దాం అని పిలుపునిచ్చారు.
Also Read:టుడే సినీ తారల క్రేజీ పోస్ట్ లు!
- Advertisement -