అదేంటోగాని తెలంగాణపై మొదటి నుంచి వివక్ష చూపుతూనే ఉండి మోడి సర్కార్.. రాష్ట్ర్రనికి రావలసిన నిధులను ఎగ్గొట్టడం, ఇచ్చిన హామీలను పక్కన పెట్టేయడం, అసలు తెలంగాణతో మాకు సంబంధమే లేదు అన్నట్లుగా వ్యవహరించడం.. అదేంటి అని కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ ప్రశించినప్పుడు సమాధానం చెప్పకుండా దాటవేయడం… ఇది తెలంగాణపై బీజేపీ సర్కార్ వైఖరి. ఇతర రాష్ట్రాలకేమో మెండుగా నిధులను విడుదల చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది. కనీసం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా రాష్ట్రంపై చిన్న చూపే వహిస్తోంది మోడి సర్కార్. .
ఒక వైపు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సకాలం విడుదల, అన్నీ విధాలుగా కేంద్ర సహకారం అండదండలు.. అబ్బో ఒక్కటేంటి బీజేపీ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కురిపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. మరి అదే ప్రేమ తెలంగాణ వంటి బీజేపీ రహిత రాష్ట్రాలపై ఎందుకు చూపించడం లేదంటే కమలనాథుల వద్ద సమాధానం లేని పరిస్థితి. ఏపీ పునః విభజన చట్టంలో భాగంగా ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నరేంధ్ర మోడీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత హామీల ప్రస్తావనే లేదు.
Also Read:కాంగ్రెస్ లో మళ్ళీ లొల్లి.. తప్పదా?
ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. అబ్బో ఇలా తెలగాణపై కురిపించిన వరాలు అన్నీ ఇన్ని కావు. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మోడీ సర్కార్. అటుంచితే గుజరాత్ కు 21 వేల కోట్లరూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. మరి తెలంగాణలో ఎందుకు ప్రారంభించడంలేదు. గుజరాత్ రాష్ట్రనికి ఒక న్యాయం ? తెలంగాణ కు ఒక న్యామయా ? అని తెలంగాణ ప్రజలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర బీజేపీ నేతల వద్ద గాని కేంద్రం వద్ద గాని సమాధానం లేదు. ఈ రకంగా చూస్తే తెలంగాణ ప్రజలకు మోడీ సర్కార్ తప్పక క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తూనే మరోవైపు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో విజయం కట్టబెట్టండని తెలంగాణ ప్రజలను వేడుకోవడం సిగ్గుచేటే అవుతుంది. బీజేపీ తెలంగాణపై వహిస్తున్న వివక్ష ప్రజలకు తెలియంది కాదు. అందుకే బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరనేది వాస్తవం.