ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. వాస్తవానికి ఆదిపురుష్ ఆగస్ట్‌లో ఓటీటీకి రావాల్సింది. కానీ ముందే ఓటీటీలోకి వస్తుందని నెట్టింట గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఐతే, ఈ వార్తలన్నీ నిజం కాదని, ముందు చెప్పినట్లు ఆగస్ట్‌లోనే ఆదిపురుష్ ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దాంతో ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఆసక్తిగా ఎదురు చూడటం లేదని టాక్ నడుస్తోంది.
అందుకే, ఆదిపురుష్ ముందే ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కాకపోతే, అగ్రిమెంట్ కారణంగా ఆగస్ట్‌లోనే ఈ సినిమా వస్తోంది. ఆదిపురుష్ మూవీ పై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. హిందూ దేవుళ్ల చిత్రాలను అభ్యంతరకరమైన డైలాగులు, కాస్టుమ్స్‌తో చిత్రీకరించి హిందువులను మనోభావాలను ఉద్దేశపూర్వకంగానే కించపరిచారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పైగా అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి శిశిర్ చతుర్వేది సినిమా పై కేసు కూడా నమోదు చేశాడు.
Also Read:పిక్ టాక్ : మితిమీరిన పరువాల జాతర
ఐతే, ఈ వివాదాలు, విమర్శల పై ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాయణం చాలా పెద్దదని, దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. ఓవరాల్ గా ఆదిపురుష్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని ప్లాప్ అయింది.
Also Read:పొలిటికల్ ఎంట్రీపై రాయుడు..