కాంగ్రెస్ పార్టీకి 2024 పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం అని చెప్పవచ్చు. ఈసారి ఏమాత్రం ఫలితాలలో ఏమాత్రం తేడాకొట్టిన హస్తం పార్టీ కథ ముగిసినట్లే. అందుకే ఈసారి గెలుపు కోసం అలుపు లేకుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. 2019 ఎన్నికలు మరియు 2014 ఎన్నికలు ఆ పార్టీని గట్టిగానే దెబ్బతీశాయి. ఊహించని రీతిలో పార్టీపై వ్యతిరేకత పెరిగి అది కాస్త బిజెపికి ప్లస్ అయింది. ఫలితంగా బీజేపీ ఎవరి అండ లేకుండానే అధికారం చేపట్టేంతలా ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టింది. దీంతో గతంలో జరిగిన తప్పులన్నీ సరిచేసుకుంటూ ఈసారి గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది హస్తం పార్టీ. ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలో మార్పు హస్తం పార్టీలో ఎనలేని జోష్ నింపిందనే చెప్పాలి..
గతంలో రాహుల్ గాంధీపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ప్రస్తుత రోజుల్లో ఆయన అనుసరిస్తున్న విధానాలు, వ్యవహార శైలి.. ప్రత్యర్థి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పక తప్పదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఒక్కసారిగా అందరి దృష్టి కాంగ్రెస్ పై పడేలా చేశాడు. యాత్రలో భాగంగా పొలాల్లోనూ, విధుల్లోనూ సామాన్యులతో రాహుల్ కలిసిపోయిన విధానం.. అందరిని ఆకర్షించింది.
Also Read: DevendraFadnavis:సుశాంత్ మర్డర్‌పై కీలక ఆధారాలు..
ఇక యాత్ర అనంతరం కూడా ఏదో ఒక రకంగా సామాన్యులతో కలిసిపోయెందుకే రాహుల్ ప్రయత్నిస్తున్నారు. లారీ డ్రైవర్లతో ముచ్చటించడం, లారీ డ్రైవర్ గా మారడం.. ఇలా ప్రతీది కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక తాజాగా మోకానిక్ లతో కలిసిపోయి మెకానిక్ అవతారం ఎత్తాడు. దీంతో రాహుల్ గాంధీలో వచ్చిన పరిణితి కాంగ్రెస్ ను రెట్టింపు ఉత్సాహంలో ముందుకు పోయేలా చేస్తోంది. అయితే రాహుల్ చేస్తున్న ప్రతీదీ కూడా వ్యూహంలో భాగమే అనేది కొందరు చెబుతున్నా మాట. సామాన్యులతో ఎంత కలగలుపుగా ఉంటే ప్రజల దృష్టిని అంతా ఆకర్షించవచ్చనే వ్యూహంతోనే రాహుల్ నిత్యం జనంతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చేందుకు రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ప్రతి విధానం ఇప్పుడు ట్రెండింగ్ టాపికే అవుతోంది.
Also Read: Paris:మానవహక్కుల ఉల్లంఘన ..ఆఫ్రికన్ బాయ్‌ని చంపిన పోలీసులు..!