బీజేపీలో మార్పు తప్పదా..?

44
- Advertisement -

2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టింది. 2014 మరియు 2019 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ 2024 ఎన్నికల్లో కూడా సత్తా చాటి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. అయితే గతంతో పోల్చితే చాలా రాష్ట్రాలలో బీజేపీ హవా తగ్గిందనే రిపోర్ట్స్ ఆ పార్టీ అధిష్టానాన్ని కలవర పడుతోందట. మోడి సర్కార్ పై ప్రజల్లో చాలా అంశాలపై విధానాలపై ప్రతికూలత ఉందని, ఆ ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

ముఖ్యంగా రాష్ట్రాల వారీగా చూసుకుంటే అధికారం చేతుల్లో ఉందనే భావనతో కాషాయ పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే చాలా రాష్ట్రాలలో పార్టీ ప్రక్షాళనపై అధిష్టానం దృష్టి పెట్టిందట. అలాగే కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులపై కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే ఇవన్ని దృష్టిలో పెట్టుకొని అటు కేబినెట్ లోనూ.. ఇటు పార్టీ పరంగాను భారీ మార్పులు తీసుకురావాలని కాషాయ పెద్దలు ఆలోచిస్తున్నట్లు టాక్. తాజాగా నిన్న అర్ధరాత్రి ప్రధాని మోడి నివాసంలో బీజేపీ పెద్దలు ఎన్నికల వ్యూహం కోసం సమావేశం అయినట్లు తెలుస్తోంది.

Also Read: Saichand:కన్నీటిపర్యంతమైన సీఎం కేసీఆర్‌

ఈ సమావేశంలో ప్రధానంగా ఆయా రాష్ట్రాలలో అధ్యక్షుల మార్పుపై చర్చించారట. ముఖ్యంగా మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా.. వంటి రాష్ట్రాలతో పాటు మరో ఏడు రాష్ట్రాలలో అధ్యక్ష పదవిపై మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ లిస్ట్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. నార్త్ లో ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో బీజేపీ హవా తగ్గింది. ఈ నేపథ్యంలో పార్టీ బలహీన పడుతున్న రాష్ట్రాలలో అధ్యక్ష పదవితో పాటు కీలక పదవులలో మార్పులు చేసి.. కొత్త నాయకులను నియమిస్తే పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మార్పు దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ముందు రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్లుతుందో చూడాలి.

Also Read: DevendraFadnavis:సుశాంత్ మర్డర్‌పై కీలక ఆధారాలు..

- Advertisement -