కవి,గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలిపారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని చెప్పారు.
Also Read:తొలి ఏకాదశి విశిష్ఠత..
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడని అన్నారు. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ… pic.twitter.com/hLWKLemSdJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 29, 2023