స్విమ్మింగ్ తో ఆ సమస్యలు దూరం..!

41
- Advertisement -

ఈత కొట్టడం అనేది ఒక సరదా కార్యకలాపంగా చూస్తారు చాలమంది. అయితే స్విమ్మింగ్ అనేది మన శరీరంపై అత్యంత ప్రభావం చూపే వ్యాయామ సాధనం కూడా. అందుకే గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వ్యాయామం కోసం కసరత్తులు చేసేవారు.. ప్రతిరోజూ ఒక గంట స్విమ్మింగ్ చేసిన సరిపోతుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్నీ అవయవాలకు కదలిక ఏర్పడుతుంది. అందుకే బాడీలోని ప్రతి ఆర్గాన్ మెగుగ్గపని చేయడానికి స్విమ్మింగ్ ఒక చక్కటి సాధనం. ప్రతిరోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల రక్త పోటు తగ్గుతుంది అలాగే మధుమేహం కూడా అదుపులో ఉంటుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. .

స్విమ్మింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. తద్వారా ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు కచ్చితంగా స్విమ్మింగ్ ఒక చక్కటి పరిష్కారంలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సుఖవంతమైన విశ్రాంతిని ఇచ్చే వ్యాయామంగా స్విమ్మింగ్ ను చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక గంట స్విమ్మింగ్ చేసిన తరువాత అవయవలన్నీ విశ్రాంతిని కోరుకుంటాయి. తద్వారా గాఢనిద్ర కలుగుతుంది.

ఇంకా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు కూడా స్విమ్మింగ్ ఒక చక్కటి పరిష్కారంలా పని చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యం శరీరంలో వివిధ భాగాల్లో పెరుకుపోయిన కొవ్వును కరిగించడంలో స్విమ్మింగ్ సమర్థవంతమైన వ్యయమంగా పని చేస్తుంది. స్విమ్మింగ్ లో ఎక్కువ కెలోరీలు ఖర్చు చేయడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. ఇక స్విమ్మింగ్ చేసిన తరువాత మానసిక ఉల్లసాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. తద్వారా మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇంకా ప్రతిరోజూ ఈత కొట్టడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పలు అద్యయానాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజూ వ్యాయామంలో స్విమ్మింగ్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణుల సూచన.

Also Read:ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా!

- Advertisement -