ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పేరు మారుమ్రోగుతోంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్ లోనే అందరి దృష్టిని ఆకర్షించడంలో బిఆర్‌ఎస్ పార్టీ గట్టిగానే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ తరువాత మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, వంటి రాష్ట్రాలు కూడా బిఆర్‌ఎస్ రాకను స్వాగతిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా నిలువబోతుందా అంటే ముమ్మాటికి ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. .
ప్రస్తుతం బిఆర్‌ఎస్ కు పెరుగుతున్న ఆసాధారణ.. ప్రధాన జాతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ ను లైట్ తీసుకున్న బీజేపీ ఇప్పుడు బిఆర్‌ఎస్ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయలో తెలియక తలలు పట్టుకుంటుంది. తాజాగా మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బిఆర్‌ఎస్ టార్గెట్ గా విమర్శలు చేయడాన్ని బట్టి చూస్తే.. మోడీకి బిఆర్‌ఎస్ భయం పట్టుకుందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.
Also Read: ప్రధాని మోదీపై సీపీఐ నారాయణ ఆగ్రహం
ఎందుకంటే అసలు బిఆర్‌ఎస్ కు సంబంధం లేని చోట ప్రధాని బిఆర్‌ఎస్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చారు. దీన్ని బట్టి మధ్యప్రదేశ్ లో కూడా బిఆర్‌ఎస్ బలం పెరుగుతోందని మోడీ గ్రహించారనే చెప్పవచ్చు. అందుకే బిఆర్‌ఎస్ పై ఘాటైన విమర్శలతో విరుచుకు పడ్డారు మోడీ. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ పది నెలల్లో దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ చాప కింద నీరు విస్తరిస్తూ.. అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు గట్టి దెబ్బే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ మోడల్ పాలనకు దేశ ప్రజలు గట్టిగానే ఆకర్షితులౌతున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి సవాలే అని చెప్పవచ్చు.
Also Read: ఆ తిలకం మర్చిపోలేను… ఫడ్నవీప్ ఉద్వేగం

