శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన సామజవరగమన చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో టాక్ బయటకు వచ్చింది.
బాలు (శ్రీవిష్ణు) తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పాసయితేనే కోట్ల ఆస్తి దక్కేలా బాలు తాతయ్య ఓ వీలునామా రాస్తాడు. దాంతో ముప్పై ఏళ్లుగా ఆ డిగ్రీ పాస్ కాలేక, కోట్ల ఆస్తి ఉన్నా.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీగానే మిగిలిపోతుంది బాలు ఫ్యామిలీ. మరోవైపు బాలు (శ్రీవిష్ణు) ప్రేమలో విఫలం అయ్యి, ప్రేమ పైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐలవ్ యూ చెబితే వెంటనే రాకీ కట్టించుకుంటుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు (రెబా మౌనికా జాన్) తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ అంతలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. చివరకు సరయు, బాలుకి రాఖీ కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. చివరకు వీరి ప్రేమ కథ ఎలా సాగింది ?, ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? అనే కోణంలో వచ్చే సీన్స్ బాగానే ఉన్నాయట.
Also Read:మార్నింగ్ వాక్‌తో ఆరోగ్యం
సామజవరగమన.. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా చాలా మలుపులు ఉన్నాయి. దీనికితోడు కథలో కూడా కామెడీ ఉండటంతో సినిమాలో ఫన్ బాగా వర్కౌట్ అయింది. దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా పాత్రలను డిజైన్ చేశాడు. నటీనటుల కూడా ఆయా పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా సీనియర్ నరేష్ కి తన కెరీర్ లో మరో మంచి పాత్ర దక్కింది. తన కామెడీ టైమింగ్ తో నరేష్ మరోసారి అలరించాడు.
హీరోగా శ్రీవిష్ణు కూడా ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అండ్ మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా రైటింగ్ టేబుల్ పైనే బలంగా సినిమాని సిద్ధం చేసుకున్నాడు. పైగా ఆ స్థాయిలోనే సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు.
Also Read:రాస్ బెర్రిస్ పండ్లతో ఆరోగ్యం అధికం.. !