‘తొలంగులాసనం’తో ఆ సమస్య దూరం..!

46
- Advertisement -

నేటిరోజుల్లో జీవన విధానంలో మార్పులు, ఆహార నియమాల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి టైమ్ కి ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు చాలమంది. అలాంటి వారికి జీర్ణ సంబంధిత తలెత్తుతూ ఉంటాయి. అజీర్తి, గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ.. మరెన్నో సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా టైమ్ కి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుతుంది. గ్యాస్ కారణంగా కడుపులో నొప్పి, మంట ఏర్పడతాయి. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యను తగ్గించేందుకు యోగాలో చల్లటి పరిష్కారం ఉంది. యోగాలోని తొలంగులాసనంతో గ్యాస్ ట్రబుల్ తో పాటు పలు రకాల ఉదర సంబంధిత సమస్యలను దూరం చ్సుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఇవి పాటిస్తే.. బాడీ ఫిట్‌నెస్ సూపర్!

తొలంగులాసనం వేయు విధానం
ఈ ఆసనం వేయడానికి ముందు నేలపై పద్మాసనం వేయాలి. ఆ తరువాత పద్మాసనం విడిపోకుండా కొద్దిగా వెనుకకు వాలి మోచేతులపై భారాన్నిమోపుతూ రెండు చేతులను పిరుదుల కింద ఉంచాలి. ఇలా చేస్తున్నప్పుడే తలను కొద్దిగా కిందకు వాల్చిచుబుకాన్ని ఛాతీకి తాకేలా ఉంచాలి. ఆ తరువాత పద్మాసనంలో ఉన్న కాళ్ళు విడిపోకుండా ఫోటోలో చూపిన విధంగా 40 డిగ్రీల కోణంలో పైకి ఎత్తాలి. ఇలా తొలంగులాసనం వేయునప్పుడు శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి.

ఉపయోగాలు.
తొలంగులాసనం వేయడం వల్ల కడుపులోని గ్యాస్ బయటకు వెళుతుంది. అంతే కాకుండా ఉదర సంబంధిత వ్యాధులు అనగా మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు దురమౌతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇంకా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఉదర కండరాలు బలపడతాయి. మోచేతులు దృఢంగా మారతాయి నడుం నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.

 

- Advertisement -