మొక్కలు నాటిన మన్నె క్రిశాంక్‌…

41
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖుల పాల్గొని మొక్కలు, పర్యవరణ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మన్నే క్రిశాంక్ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా నివాస ప్రాంగణములో మొక్కలు నాటారు.

Also Read: CM KCR:శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణలో ఏ శుభకార్యం జరిగిన మొక్కలు నాటడం సాంప్రదాయంగా మారిందని అన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం, ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో గ్రీనరి పెరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి శ్రవణ్‌, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: CMKCR:మాది Aటీమ్, Bటీమ్ కాదు … రైతుల టీమ్‌

- Advertisement -