11వ విడత రైతుబంధు పంపిణీ..

71
- Advertisement -

రైతులకు భరోసానిచ్చే రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయమే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులతో మొబైల్స్ మోగిపోయాయి. తోలిరోజు గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ అయింది.

వానాకాలం సాగుకు సంబంధించిన పంటసాయం ఈనెల 26 నుంచి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు , ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు దానికి సంబంధిన ప్రక్రియను వేగవంతం చేసి సోమవారం ఉదయాన్నే రైతుల ఖాతాల్లో జమయ్యేట్లు చర్యలు తీసుకున్నారు.

Also Read:వర్షాకాలంలో వచ్చే అలెర్జీలకు వీటితో చెక్.. !

ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు అందిస్తున్నది. రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్‌లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనుంది. 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -