మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల హెల్త్ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే మనకు పోషకాహార లోపంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సరైన పోషకాలు ఉన్న పదార్థాలను తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడి మనిషి రోగాల బారీన పడే అవకాశం ఉంటుంది. అయితే సరైన విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను మనం సులభంగా నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా కూరగాలు, పండ్లు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేగాదు వీటి అరుగుదల సమయం కూడా తక్కువే. మనం పండ్లు లేదా కూరగాయాలు ఆహారంగా తీసుకుంటే కేవలం 15 – నుండి 20 నిమిషాల్లో జీర్ణం అవుతాయి.
ఇక ఆహారంలో విటమిన్ ఎ,సి, ఇ ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడంతో ఎండ వల్ల కందిన చర్మాన్ని సంరక్షించడమే కాక.. ఇతర కారణాల వల్లే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. నట్స్, క్యారెట్లు, కోడిగుడ్లు, నిమ్మకాయ, కివీలు, ద్రాక్ష, డ్రైయ్ ఫ్రూట్స్ తదితర పదార్థాలను తీసుకోవాలని సూచించారు.దంతాలు, ఎముకల సమస్యలతో బాధపడేవారు విటమిన్ డి, కాల్షియం ఉన్న ఆహార పదార్థాలతో పాటు ట్యాబ్లెట్లను కూడా వాడాలని చెప్తున్నారు. రాజ్మా, పాలు, సోయా, పాలకూర, పెరుగు తదితర ఆహార పధార్థాల్లో ఇవి విరివిగా లభిస్తాయి.
Also Read:లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా!