నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించిన తర్వాత పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో వడగాలులు, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్టైంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండ కొట్టిన…సాయంత్రం ఆకాశం మేఘావృత్తమై…వర్షం కురిసింది. తాజాగా హైదరాబాద్లోని తార్నాక, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట, సికింద్రాబాద్, హబ్సిగూడ, బేగంపేట, సోమాజిగూడ, అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అంబర్పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే రానున్న రోజుల్లో తెలంగాణాంతటా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read: తెలంగాణ..ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక