BRSUSA:తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం

76
- Advertisement -

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్‌ అన్నారు. యూఎస్ఏలోని 50రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు కొలంబస్‌ నగరంలో జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఇది బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత అమెరికాలో తొలి జాతీయ సదస్సు. రాబోయే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ కార్యకర్తల పాత్ర కీలకమని అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తన్నీరు మహేష్ ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులు ఆమోదించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అటార్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ అసోసియేషన్స్ అధ్యక్షులు అరిందమ్ గుహ, బ్లూ ఆష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్‌ ప్రమోద్ ఝువేరి పాల్గొన్నారు. ఈ సదస్సులో కన్వీనర్లు పూర్ణ భైరి, చందు తాళ్ల వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టారు. అలాగే నరసింహ నాగులవంచ, అరవింద్ తక్కళ్లపల్లి, రజినీకాంగ్ కూసానం, వేణు పామేర, డేవిడ్‌ విక్రమ్‌, రామకృష్ణ కాసర్ల, విష్ణు, సుధాకర్‌, శ్రీనివాస్‌ ఆకుల, శ్రీధర్ బిల్లకంటి, అశోక్‌ ఎల్లందుల, అమర్‌ రెడ్డి, సాజిత్‌ దేశినేని పాల్గొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన అతిథులకు నరసింహ నాగులవంచ 30రకాల తెలంగాణ వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు.

తన్నీరు మహేశ్ మాట్లాడుతూ…తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ దూర దృష్టి ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో రెండు లక్షల యాబై వేల కోట్ల ఎగుమతులు జరిగాయంటే కేవలం కేటీఆర్ సమర్థ నాయకత్వం వల్లే జరిగాయని ఈ సభ సందర్భంగా తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా 15రోజుల్లో కంపెనీలు స్వీయ ధ్రువీకరణ చేసుకోగలిగే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. టి-హబ్‌ ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యూబేటర్‌ అని టీ-వర్క్స్‌ ఆవిష్కర్తలకు చిన్న మరియు మధ్యస్థ సంస్థలకు దేశంలో హైదరాబాద్‌ కేంద్రబిందువుగా మారిందన్నారు.

వినీత మెహ్రా మాట్లాడుతూ…తెలంగాణ ఐటీ రంగంలో కాకుండా ఫార్మా ఎగుమతులలో కూడా దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సైబర్ సెక్యూరిటీ డేటా సెంటర్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలిజీ విధానాలు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు మానవ వనరులు పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిందన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న 15.6 శాతం వృద్ధి రేటుతో.. 2028 నాటికి దేశంలో మూడవ వంతు అభివృద్ధి, ఫార్మా రంగంలో ఐదవ వంతు ఎగుమతులు వంద బిలియన్ల వ్యాపార ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఉంటాయన్నారు.

Also Read: మొక్కలు నాటిన సీఎం పీఆర్‌వో

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ నాయకులు అడ్వైజర్ రవి ధన్నపునేని, బిందు చీదెళ్ల, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.. డల్లాస్ నుండి శ్రీనివాస్ సురభి,మనోజ్ ఇనగంటి, శ్రీకాంత్ పీచర, దేవేందర్ చిక్కాల, గిరిధర్ వీరమనేని, శశి దొంతినేని, ఆస్టిన్ నుండి హరీష్ రెడ్డి వ్యాల్ల, శ్రీనివాస్ పొన్నాల న్యూ జెర్సీ నుండి మహేష్ పొగాకు, శ్రీనివాస్ జక్కిరెడ్డి. వాషింగ్టన్ డీసీ నుండి అనిల్ కాశినేని, కిషోర్. అట్లాంటా నుండి శ్రీధర్ జూలపల్లి, రంజిత్ కోదాటి ఫ్లోరిడా నుండి టోనీ జన్ను, కాలిఫోర్నియా నుండి రాజ్ భవాని, శివ కాలేరు, డెట్రాయిట్ నుండి అనిల్ దొంతినేని, వెంకట్ మంతెన డెలావేర్ నుండి భాస్కర్ పిన్న చికాగో నుండి మహిపాల్ రెడ్డి, ప్రశంష్ సియాటిల్ నుండి గణేష్ యూత్ కమిటీ నాయకులు అభిషేక్ కొత్తూర్, ఉదయ్ యాదవ్, కిషోర్, శరన్ దొంతినేని, కార్తీక్ రంగినేని, సంతోష్ పాల్గొన్నారు.

Also Read: Weather:ఆంధ్రను పలకరించిన వానలు ..నెక్ట్స్‌ తెలంగాణ

- Advertisement -