Ram Charan:అప్పటివరకు నో షూటింగ్స్‌!

46
- Advertisement -

రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కాగా ఆమె డెలివరీ అయ్యే వరకు ఎలాంటి షూటింగ్‌లకు హాజరయ్యే ప్రసక్తేలేదని చెప్పారు చరణ్.

గత నెల రోజుల నుండి ఎలాంటి షూటింగ్‌లకు వెళ్లడం లేదు చరణ్. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు గేమ్ చేంజర్‌ టైటిల్ ఖరారు చేయగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం సినిమా షూటింగ్‌ పూర్తికాగా క్లైమాక్స్ తో పాటు చరణ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చెయ్యాల్సి ఉంది. దీంతో ఉపాసనతోనే ఉన్న చరణ్ డెలివరీ అయ్యే వరకూ షూటింగ్ కి అటెండ్ కానని క్లియర్ గా చెప్పేశారట.

Also Read:దశాబ్ది ఉత్సవాలు..తెలంగాణ హరితోత్సవం

ఇటీవల చరణ్, ఉపాసన శర్వానంద్ పెళ్లిలో, వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో సందడి చేశారు. లేటెస్ట్ గా పుట్టబోయే బేబీ కోసం చేత్తో చేసిన ఉయ్యాల కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉపాసన తన పేరెంట్స్ దగ్గర ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మాత్రం చిరంజీవి ఇంటికే వెళ్లి ఉంటామని ఇటీవల తెలిపింది.

Also Read:హ్యాపీ ఫాదర్స్‌ డే…

- Advertisement -